
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి తన కన్న తండ్రినే అతి దారుణంగా హత్య చేశాడు. హయత్ నగరిలోని బృందావన కాలనీలో ఈ ఘోరం జరిగింది. విష్ణు అనే వ్యక్తి తన తండ్రి రాంనర్సింహాని రోకలి బండ తో దాడి చేసి హత్య చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. తప్ప తాగి విష్ణు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.