వైరల్ వీడియో: రికార్డు కోసం 6 లక్షల తేనెటీగలతో కుట్టించుకున్నాడు

వైరల్ వీడియో: రికార్డు కోసం 6 లక్షల తేనెటీగలతో కుట్టించుకున్నాడు

న్యూఢిల్లీ: ఒక్క తేనెటీగ కుడితేనే తట్టుకోలేం. అలాంటిది ఇక్కడో వ్యక్తి ఏకంగా కొన్ని లక్షల తేనెటీగలను తన ఒంటినిండా కుట్టించుకున్నాడు. చైనాకు చెందిన రువాన్ లియాంగ్‌‌మింగ్ అనే వ్యక్తి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేయాలనుకున్నాడు. దీని కోసం ఏకంగా దాదాపు 6.37 లక్షలకుపైగా తేనెటీగలను కుట్టించుకొని లియాంగ్ రికార్డు సృష్టించాడు. 2014లో జరిగిన ఈ అడ్వెంచర్ వీడియోను తాజాగా  గిన్నిస్ వరల్డ్ రికార్డు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి 5.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను మీరూ చూసేయండి.