యూట్యూబ్ లైవ్‌లో ఛాలెంజ్.. 1.5 లీటర్ వోడ్కా తాగి చనిపోయిన వ్యక్తి

యూట్యూబ్ లైవ్‌లో ఛాలెంజ్.. 1.5 లీటర్ వోడ్కా తాగి చనిపోయిన వ్యక్తి

ఒక వ్యక్తి యూట్యూబ్ లైవ్‌లో 1.5 లీటర్ వోడ్కా తాగి చనిపోయాడు. ఆ వ్యక్తి వోడ్కా తాగడం.. చనిపోవడం అంతా లైవ్‌లోనే జరిగింది. ఆ వీడియోను చూసిన ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. ఈ భయానక ఘటన రష్యాలో జరిగింది. ఆ వ్యక్తిని రష్యాకు చెందిన వ్యక్తిని 60 ఏళ్ల యూరి దుషెచ్కిన్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన డబ్బు కోసం ఓ యూట్యూబర్ విసిరిన చాలెంజ్‌ని స్వీకరించాడు. ఆపకుండా మద్యం తాగాడం కానీ లేదా వేడివేడి సాస్ తినడం కానీ చేయాలని యూట్యూబర్ యూరికి సవాల్ విసిరాడు. అందులో భాగంగా ఆపకుండా 1.5 లీటర్ వోడ్కా తాగాడు. అది తాగే సమయంలో బాగానే ఉన్న యూరి.. కాసేపటి తర్వాత కుప్పకూలిపోయాడు. ఆ తతంగమంతా లైవ్‌లో టెలికాస్ట్ అయింది. గత వారం స్మోలెన్స్క్ నగరంలో జరిగిన ఈ సంఘటనపై రష్యా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై రష్యన్ సెనేటర్ అలెక్సీ పుష్కోవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో హింసను ప్రోత్సహించే ఇటువంటి వాటిని నిషేధించాలని ఆజ్ఞాపించారు.

For More News..

ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ యువతి

రైతుల ‘చక్కా జామ్’..  పోలీసుల కంట్రోల్‌లోకి ఢిల్లీ