ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

హైదరాబాద్: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి బలయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. స్వామి అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి ఆర్టీసీ లగ్జీరీ బస్సులో ఆదిలాబాద్‎కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామశివారు దగ్గర వాంతులు వచ్చినట్లు అనిపించడంతో బస్సు డ్రైవర్‎కు చెప్పి బస్ డోర్ దగ్గర నిలబడి వాంతింగ్ చేసుకుంటున్నాడు. అయితే.. డ్రైవర్ బస్సు ఆపకుండా అలాగే ముందుకు వెళ్లడంతో ప్రమాదవశాత్తూ స్వామి బస్సు నుంచి జారి కిందపడ్డాడు. 

బస్సు వెనక టైర్లు మీదినుంచి వెళ్లడంతో స్వామి అక్కడికక్కడే మరణించాడు. బస్సు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించిందని మృతుని భార్య మమత  పోలీసులకు ఫిర్యాదు చేసింది. మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భిక్కనూర్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన స్వామిగా గుర్తించారు పోలీసులు.