20 ఏళ్ల కుర్రోడు.. గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ.. గుండెపోటుతో చనిపోయాడు

20 ఏళ్ల కుర్రోడు.. గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ.. గుండెపోటుతో చనిపోయాడు

కుర్రోడు అంటే అక్షరాల కుర్రోడు.. 20 ఏళ్లు.. ఎలా ఉంటాడండీ.. ఫుల్ ఎనర్జీగా ఉంటాడు.. ఈ కుర్రోడు కూడా అలాగే ఉన్నాడు. ఎంతో చలాకీగా.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉండేవాడు.. ఈ క్రమంలోనే వినాయక చవితి వచ్చింది. గ్రామంలో వినాయక విగ్రహం పెట్టారు.. ఫ్రెండ్స్ తో కలిసి రాత్రి సమయంలో పూజ తర్వాత.. డాన్స్ చేస్తున్నాడు.. అప్పటి వరకు బాగానే ఉన్నాడు.. ఏమైందో ఏమో.. డాన్స్ చేస్తూనే కుప్పకూలిపోయాడు. ఫ్రెండ్ అందరూ భయపడ్డారు. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు. కారణం.. కార్డియాక్ అరెస్ట్.. తీవ్ర గుండెపోటు.. 20 ఏళ్ల కుర్రోడు.. కళ్ల ముందు నిలువునా కుప్పకూలిపోయి చనిపోవటం ఆ కుటుంబాన్నే కాదు.. గ్రామం మొత్తాన్ని విషాదంలోకి తీసుకెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ALSO READ : 108 వాహ‌నంలో డెలివరీ.. త‌ల్లీ బిడ్డ క్షేమం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని గణేష్ మండపం వద్ద విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ధర్మవరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేస్తున్నారు. అంతలోనే ఆ ఇద్దరిలో ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బాధితుడిని 26 ఏళ్ల ప్రసాద్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోనూ విస్తృతంగా షేర్ అవుతోంది.

ఇటీవలి కాలంలో ఈ తరహా గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయి. జూలైలో, 28 ఏళ్ల వ్యక్తి మార్నింగ్ వాక్ సమయంలో కుప్పకూలి మరణించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం జరిగిన మరో ఘటనలో గుండ్ల పోచంపల్లి మున్సిపల్‌ పరిధిలోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు.