వామ్మో.. ఇదేం సలాడ్ రా బాబూ...

వామ్మో.. ఇదేం సలాడ్ రా బాబూ...

సాధారణంగా వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆకలేసిపప్పుడు దగ్గరలో ఉన్న హోటల్ కు వెళ్తాం.  అలానే ఢిల్లీ ఓ వ్యక్తి మధ్యాహ్న భోజనం కింద పీక్ ఢిల్లీ హోటల్ లో సలాడ్ కు ఆర్డర్ ఇచ్చాడు. అయితే అందులో  దోసకాయలు, ఉల్లిపాయలు మాత్రమే ఉన్నాయి.  దీనిని ఆయన ఆశ్చర్యపోయి ఆ చిత్రాన్ని   నీల్ బోరాటే అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.  ఆ ఫొటోకు  భోజనం కోసం సలాడ్ అడిగితే నాకు ఇది లభించింది అని క్యాప్షన్ ఇచ్చాడు. 

ఢిల్లీ హోటల్‌లో సలాడ్‌ని ఆర్డర్ చేసిన వ్యక్తి నిరాశకు గురయ్యాడు.   నీల్ బహుశా క్యారెట్, టొమాటో, పచ్చిమిర్చి, నిమ్మకాయ ముక్కలతో ఫ్యాన్సీ సలాడ్ కోరాడని తెలుస్తోంది.  అతను ఇలాంటి సలాడ్ ఎక్కడ చూడలేదన్నాడు. సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతోంది.  ఇప్పటికే  395 K మంది చూశారు. సలాడ్  చాలా రకాలుగా ఉంటుందనే విషయాన్ని నీల్ తెలుసుకోవాలని చాలామంది అన్నారు.  ఇది ఇండియన్ సలాడ్ . . .ఆలివ్ ఆయిల్ లేదు, మూలికలు, ఆర్టిచోక్‌లు, అరుగూలా ఆకులు, రోజ్ మేరీ మొదలైనవి లేవు  అని ట్విట్టర్ యూజర్ ఒకరు వివరించారు. మరో వ్యక్తి  ఇది ప్రాథమిక గ్రీన్ సలాడ్ అన్నారు.