
లండన్: సినిమా హాల్లోనో, స్టేడియంలోనో టికెట్ల కోసం లైన్లో నిల్చోవాలంటే ఎక్కడలేని నీరసం వచ్చేస్తుంది కొందరికి.. సినిమా, మ్యాచ్ చూడాలని ఉన్నా చాంతాడంత పొడవున్న క్యూ భయపెడుతుంది. కానీ లండన్‌లో ఓ యువకుడు దీనినే సంపాదనగా మార్చుకున్నడు. అవసరమైన వాళ్ల కోసం లైన్లో ఉండి గంటకు 20 పౌండ్ల చొప్పున రోజుకు ఏకంగా 160 పౌండ్లు ఆర్జిస్తున్నడు. అంటే మన రూపాయల్లో 16 వేలకు పైనే. ఇందుకోసం లండన్‌కు చెందిన ఫ్రెడ్డీ బెకిట్రోజుకు 8 గంటల వరకు నిల్చుంటడు.