ఫోన్ ఇవ్వనందుకు.. స్నేహితుడిని కత్తితో పొడిచి చంపాడు

 ఫోన్ ఇవ్వనందుకు.. స్నేహితుడిని కత్తితో పొడిచి చంపాడు

మొబైల్ ఫోన్ .. ఇద్దరు స్నేహితల మధ్య గొడువ పెట్టి.. ప్రాణం తీసింది. మొబైల్ ఫోన్  ఇవ్వనందుకు ఓ వ్యక్తి తన స్నేహితుడిని హత్య చేశాడు. ఈ  దారుణ సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మయిగూడ మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఓల్డ్ విలేజ్ లో ఈ ఘటన కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్ జిల్లా దమ్మయి గూడలో వివాసముంటున్న జితేందర్ చౌదరి.. 15 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి పెయింటింగ్ కాంట్రాక్టు పని కోసం హైదరాబాద్ వచ్చాడు. పెయింటింగ్ కాంట్రాక్ట్ పనికి కూలీల కోసం అతను యూపీలోని జైలైతావ జిల్లా జమాన్పూర్ గ్రామానికి చెందిన రవి జనార్, బాబు చమ్మర్ లను హైదరాబాద్ కు తీసుకువచ్చాడు. వారి ఇరువురికి దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఒక గదిలో వసతి ఏర్పాటు చేశాడు. 

ఈ క్రమంలో  రాత్రి 10 గంటల 50 నిమిషాలకు వారిద్దరు ఉంటున్న ప్రాంతానికి  జితేందర్ చౌదరి వెళ్లగా.. రవి జనార్ అనే వ్యక్తి తీవ్ర రక్త స్రావంతో పడి ఉండటం చూసి.. బాబును అడగగా, తన మొబైల్ ఇవ్వనందుకు కూరగాయలు కత్తితో పొడిచి చంపినట్లు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిధితుడిని అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.