నీచుడా.. షాపింగ్ మాల్ లో ఏంట్రా ఆ పని

నీచుడా.. షాపింగ్ మాల్ లో ఏంట్రా ఆ పని

కేరళ (Kerala)లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు బుర్‌ఖా ధరించి (Wearing Burqa) మహిళల వాష్‌రూమ్‌ (Womens Toilet)లోకి ప్రవేశించి తన ఫోన్‌లో వీడియోలు రికార్డు ( Records Videos) చేశాడు. ఈ ఘటన కొచ్చిలోని ఓ ప్రముఖ మాల్‌ (Kochi Mall )లో బుధవారం ( ఆగస్టు 16)  చోటు చేసుకుంది. 

ఓ  యువకుడు ( 23)  కొచ్చిలోని ఫేమస్‌ లులు మాల్‌ (Lulu Mall)కు వెళ్లాడు.  సహజంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కస్టమర్ల కోసం వాష్ రూం లు ఉంటాయి.  వీటినే అదనుగా తీసుకొని అతగాడు నీచమైన పనికి వడిగట్టాడు.   బుర్‌ఖా  ధరించి మాల్‌లోని మహిళల వాష్‌రూమ్‌లోకి ప్రవేశించి తన ఫోన్‌లో వీడియోలు రికార్డు ( Records Videos) చేశాడు. రహస్య కెమెరాను వాష్‌రూమ్‌లోని డోర్‌కు అమర్చాడు. ఆ తర్వాత బయటకు వచ్చి వాష్‌రూమ్‌ మెయిన్‌ డోర్‌ ముందు నిలబడ్డాడు.  చాలా సేపు అక్కబే ఉండటంతో మాల్ సిబ్బందికి అనుమానం వచ్చింది.  దీంతో అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో  పోలీసులకు సమాచారం ఇచ్చారు మాల్‌ సిబ్బంది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మహిళ వేషం వేసుకుని వాష్‌రూమ్‌లోని దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డు చేస్తున్నట్లు తేలింది.

నిందితుడి నుంచి బుర్‌ఖా, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సదరు యువకుడు ఇన్ఫోపార్క్‌లోని ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు అతడిపై ఐపీఎస్‌ సెక్షన్లు 354 (సీ), 419, 66ఈ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత అతన్ని స్థానిక కోర్టులో హాజరుపరచగా నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు కలమసేరి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. నిందితుడు గతంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.