
దూరం ప్రాంతం లేదా తెలియని ప్రాంతానికి వెళుతున్నప్పుడు.. గతంలో దారి మధ్యలో ఎవరినైనా అడుగుతూ వెళ్లేవాళ్లం.. ఇప్పుడు మాత్రం గూగుల్ మ్యాప్.. ఎవర్నయినా అడుగుదాం అని ఎవరైనా అంటే.. అబ్బే ఎందుకు.. గూగుల్ మ్యాప్ ఉండగా అనే సమాధానం వస్తుంది.. అలా గూగుల్ మ్యాప్ పెట్టుకుని జర్నీ చేస్తున్న చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఘటన ఇటీవల చూస్తున్నాం.. మొన్నటికి మొన్న తెలంగాణలో గూగుల్ మ్యాప్ ద్వారా నదిలోకి వెళ్లిన సంఘటన మర్చిపోక ముందే.. ఇప్పుడు కర్నాటకకు చెందిన ఓ ఫ్యామిలీ.. గూగుల్ మ్యాప్ సాయం.. నీలగిరిలోని ఇళ్ల మధ్య.. జనం నడిచే మెట్ల మార్గంలోకి వెళ్లిపోయింది.. మధ్యలోకి వెళ్లిన తర్వాత.. ముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేక పోలీసుల సాయం కోరారు ఆ కారులోలో ప్రయాణిస్తోన్న స్నేహితులు.. ఈ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం...
అడ్రస్ కోసం గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడిన ఒక SUV డ్రైవర్ తమిళనాడులోని కొండల పట్టణమైన గూడలూర్‌లోని మెట్ల సముదాయంలో చిక్కుకుపోయాడు. ఆ వ్యక్తి గూడలూర్ నుండి డ్రైవింగ్ చేస్తూ చేస్తూ. కర్ణాటకకు తిరిగి వెళ్ళే మార్గంలో గూగుల్ (Google)మ్యాప్స్‌ని ఉపయోగించాడు. ఈ క్రమంలోనే అతను తప్పుడు మార్గంలో వెళ్లి.. చిక్కిపోయాడు. తమిళనాడు, కేరళ- కర్ణాటకల మధ్య ట్రై-జంక్షన్ వద్ద ఉన్న గూడలూర్ ఒక ఫేమస్ హాలిడే స్పాట్. దీన్ని తరచుగా ఊటీకి వెళ్లే పర్యాటకులు సందర్శిస్తారు.
Google Maps ఆదేశాలను అనుసరించి, నావిగేషన్ మ్యాప్స్ అప్లికేషన్ "ఫాస్టెస్ట్ రూట్"గా పేర్కొన్న పోలీస్ క్వార్టర్స్ ద్వారా కారును పోనిచ్చాడు. అయితే, ఈ మార్గం వారిని నివాస ప్రాంతంలోని నిటారుగా ఉన్న మెట్ల వద్దకు తీసుకువెళ్లింది. ముందుకు వెళ్లలేక, ఆ వ్యక్తి వాహనాన్ని మెట్లపై నిలిపి స్థానికుల సహాయం కోరాడు. సమాచారమందుకున్న చుట్టుపక్కల వారు, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారు కర్నాటకకు తిరిగి వెళ్లడానికి SUVని తిరిగి మెయిన్ రోడ్డుకి వెళ్లడానికి వారికి సాయం చేశారు.