ఢిల్లీలో మెట్రో రైలు ఢీకొని వ్యక్తి మృతి..!

ఢిల్లీలో మెట్రో రైలు  ఢీకొని వ్యక్తి మృతి..!

మెట్రో ట్రైన్ అందుబాటులోకి వచ్చాక ట్రాఫిక్ బాధ చాలా వరకు తప్పిందని చెప్పాలి. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు ట్రాఫిక్ లో చిక్కుకునే బాధ నుండి విముక్తి లభించిందని చెప్పాలి. మెట్రో ప్రయాణం వల్ల సమయం ఆదా అవ్వటం, ట్రాఫిక్ బెడద తప్పటమే కాకుండా ప్రమాదాలు జరిగే ఛాన్స్ కూడా తక్కువ అనే చెప్పాలి.అలాంటిది ఢిల్లీ మెట్రోలో జరిగిన ప్రమాదం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

మెట్రో ట్రైన్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. మెట్రో అధికారులు తెలిపిన 0వివరాల ప్రకారం బుధవారం 11:30నిమిషాల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని ఒక వ్యక్తి మెట్రో ట్రైన్ ఢీకొని మృతి చెందాడని తెలుస్తోంది. మిలీనియం సెంటర్ నుండి గురుగ్రామ్ వరకు వెళ్లే ఎల్లో లైన్ ట్రైన్ కోసం ఉద్యోగ భవన్ వద్ద వెయిట్ చేస్తున్న వ్యక్తి ట్రైన్ ఢీకొని మృతి చెందాడని మెట్రో అధికారులు తెలిపారు.

ALSO READ :- కేసీఆర్కు పట్టిన గతే..మోదీకి పడుతుంది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఈ సంఘటన తర్వాత 20నిమిషాల పాటు మెట్రో సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వ్యక్తి జేబులో ఒక ఫోన్ నంబర్ రాసి ఉన్న స్లిప్ మినహా ఎలాంటి ఆధారాలు దొరకలేదని, మరిన్ని ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నామని మెట్రో అధికారులు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.