
మహబూబాబాద్ జిల్లా : జిల్లాలోని బయ్యారం మండలం నామాలపాడులో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్యను కత్తితో పొడిచి, గొంతునులిమి చంపాడు. వివరాలు.. పెనుగొండ గ్రామానికి చెందిన నరేష్, సరితలు భార్యాభర్తలు. గత వారం రోజుల క్రితం వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఆ గొడవల్లో సరితకు చెయ్యి విరిగి, ఆమె తలకు గాయమైంది. ఆమె తల్లిగారి ఇల్లు బయ్యారంలో ఉండగా.. నరేష్ ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్తా అని నమ్మబలికాడు. నామాలపాడు అడవుల వద్దకు తీసుకొచ్చి భార్యను గొంతు నులిమి, కత్తితో పొడిచి హత్య చేసి అక్కడే పడేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు… నరేష్ ను అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.