
తంగళ్లపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆస్తి కోసం తండ్రిని కొట్టి చంపాడో కొడుకు. పోలీసుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండలం పద్మానగర్‌కు చెందిన దూస ఆంజనేయులు(65) భార్య లలిత. వీరికి నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. వీరిలో ముగ్గురు కూతుళ్లు, కొడుకులకు పెళ్లిళ్లు కాగా చిన్న కూతురుకు కావాల్సి ఉంది. ఆస్తి పంపకాల విషయంలో పెద్ద కొడుకు శ్రీనివాస్‌కు, తండ్రి ఆంజనేయులకు వివాదం తలెత్తింది. 3 భాగాలుగా పంచుతానని తండ్రి చెప్పగా అందుకు శ్రీనివాస్ఒప్పుకోలేదు. 2 భాగాలుగా పంచకపోతే చంపేస్తానంటూ తండ్రిని బెదిరించాడు. భయపడిపోయిన ఆంజనేయులు కుటుంబంతో సహా రెండేండ్లుగా వేములవాడలోని పెద్ద కూతురు వద్ద ఉంటున్నాడు. పద్మానగర్లోనే ఉంటున్న శ్రీనివాస్ఇటీవల ఇంటి గోడను తండ్రి భాగంలోకి జరిపి కట్టాడు. విషయం తెలుసుకున్న ఆంజనేయులు గురువారం పద్మానగర్వెళ్లాడు. తిరిగి వేములవాడ రాకపోవడంతో శుక్రవారం ఉదయం లలిత పద్మానగర్‌కు వెళ్లింది. అప్పటికే శ్రీనివాస్ ఇంట్లో ఆంజనేయులు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. కొంతకాలంగా ఆస్తి కోసం బెదిరిస్తున్న శ్రీనివాసే తండ్రిని చంపి ఉంటాడన్న తల్లి లలిత ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మారెడ్డి కేసు ఫైల్ చేశారు. శ్రీనివాస్ కుటుంబంతో సహా పరారీలో ఉన్నాడు.