ఢిల్లీలో ఓ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు... తన యజమాని ఇంట్లో పనిమనిషిని చంపేసి దొంగతనంగా చిత్రీకరించాడు. ఢిల్లీలోని హౌజ్ కాస్ ఏరియాలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పని మనిషి కనిపించట్లేదని యజమాని డ్రైవర్ ను అడుగగా..ఆమె దొంగతనం చేసి పారిపోయిందని చెప్పాడు.దీంతో ఆ యజమాని సమీపంలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజం తెలిసింది.
దర్యాప్తులో భాగంగా పోలీసులు డ్రైవర్ ను ప్రశ్నించగా.. అతను పనిమనిషిని చంపేసి నోయిడా ప్రాంతంలో పాతిపెట్టాడని తేలింది. ఆమె దొంగతనమేమి చేయలేదని నిర్దారించిన పోలీసులు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. మొత్తానికి పనిమనిషిని చంపేసి దొంగతనంగా చిత్రీకరించాలన్న డ్రైవర్ ప్లాన్ పోలీసుల దర్యాప్తుతో భగ్నం అయ్యింది.