వీడిని ఏం చేయాలంటే : మనుషులు ఇంత ఘోరంగా ఉన్నారేంటీ..?

వీడిని ఏం చేయాలంటే : మనుషులు ఇంత ఘోరంగా ఉన్నారేంటీ..?

వీడు తండ్రిని చంపాడు.. అలా ఇలా కాదు.. ఒంటికి నిప్పు అంటించి మరీ చంపాడు.. వాడు చంపింది కన్న తండ్రిని.. కారణం తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.. మనుషులు ఏంటీ ఇలా ఉన్నారు. ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నారు అనే మాట రాక మానదు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

చిక్కనంకుడి సమీపంలో నివాసం ఉంటున్న నిందితుడు బిబిన్‌..  తనతో కలిసి సహజీవనం చేసేందుకు  ఓ యువతిని ఇంటికి తీసుకొచ్చాడు. అయిుతే దీనికి  అతని తండ్రిని థంకచన్ అయ్యప్పన్ (55) అభ్యంతరం వ్యక్తం చేశాడు.  తాను బయటకు వెళ్లి ఆ యువతితో బ్రతికేందుకు తనకు బంగారం, డబ్బు ఇవ్వాలని  థంకచన్ ను అడిగాడు  బిబిన్‌. అందుకు థంకచన్ ఒప్పుకోలేదు. ఇదే  విషయమై జూన్ 9వ తేదీ ఆదివారం రోజునల  తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. 

సహనం కోల్పోయిన  బిబిన్ తన వద్ద ఉన్న బిల్‌హూక్ హ్యాండిల్‌తో థంకచన్‌ తల పలగొట్టాడు.  దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు.  దీంతో బిబిన్  తన తండ్రి మృతదేహాన్ని ఒక షెడ్‌లోకి తీసుకెళ్లి పైకప్పుకు ఉపయోగించే ప్లాస్టిక్ షీట్‌తో కప్పి నిప్పంటించాడు. మంగళవారం పొరుగువారు కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బిబిను మంకులంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  విచారణ అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.