వీధి కుక్కను చంపి.. 100 మీటర్లు ఈడ్చుకెళ్లాడు

వీధి కుక్కను చంపి.. 100 మీటర్లు ఈడ్చుకెళ్లాడు

యూపీలో హృదయ విదారక ఘటనలు రెండు వెలుగులోకి వచ్చాయి.  ఈ రెండూ కూడా జంతు హింసకు సంబంధించినవి.  లక్నోలో  ఓ వ్యక్తి వీధికుక్కను చంపి దానిని తాడుతో కట్టి100 మీటర్లు ఈడ్చుకెళ్లాడు.   ఆ తరువాత ఆ కుక్కను కాలువలో పడుశాడు.ఈ సంఘటనకు సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ  నిందితుడి వెనుక ఓ వృద్ధుడు కూడా చేతిలో కర్రతో నడుచుకుంటూ వస్తున్నాడు. పప్పు అనే వ్యక్తి  ఆటో రిక్షా డ్రైవర్ సహాయంతో కుక్కను చంపినట్లు సమాచానం అందుతోంది.  

జంతు హింసకు సంబంధించిన మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో 19 ఏళ్ల యువకుడు రెండు కుక్కలను కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది.  ఒక యువకుడు కనికరం లేకుండా రెండు కుక్కలను కర్రతో కొట్టడం కనిపించిందని పోలీసు సూపరింటెండెంట్ పిఎస్ ఆనంద్  తెలిపారు. విచారణ ప్రారంభించిన పోలీసులు  నిందితుడు అజీమ్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల ఫిర్యాదు ఆధారంగా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఖాన్‌పై జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టంలోని సెక్షన్ 11 (జంతు హింస) కింద కేసు నమోదు చేశారు.