ఎయిర్ పాడ్స్.. కేరళలో మిస్సింగ్.. గోవాలో వాడుతున్నారు..

ఎయిర్ పాడ్స్.. కేరళలో మిస్సింగ్.. గోవాలో వాడుతున్నారు..

మనం ప్రయాణంలో వస్తువులను పోగొట్టుకోవడం సాధారణం. సెల్ ఫోన్లు, ఎయిర్ పాడ్స్ ఇలా..ఎలక్ట్రానిక్స్ వస్తువులను తరుచుగా మిస్ చేసుకుంటుంటాం. అయితే ఈ డిజిటల్ యుగంలో కోల్పోయిన వస్తువులను కనుగొనడం సులభమే. ఎందుకంటే అభివృద్ధి చెందిన టెక్నాలజీతో మన వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం ఈజీనే. కేరళలోని ఓ వ్యక్తి తన ఎయిర్ పాడ్ లను పొగొట్టుకుని గోవాలో ఉన్నట్లు కనుగొనడం ద్వారా ఆశ్చర్యంగా ఉందని ఎక్స్(X) లో తన అనుభవాన్ని పంచుకున్నాడు.   

కేరళకు చెందని నిఖిల్ అనే వ్యక్తి ఎయిర్ పాడ్స్ పోగొట్టుకొనివాటిని గోవాలో కనుగొన్న ఘటనకు సంబంధించిన వివరాలను X  లో షేర్ చేశాడు. కేరళ నేషనల్ పార్క్ గుండా బస్సులో ప్రయాణిస్తుంటే.. తన ఎయిర్ పాడ్ లను మిస్సయ్యాడు.  అతడు పోగొట్టుకున్న ఎయిర్ పోడ్ లను ఎలాగైన కనుగొనాలనే సంకల్పంతో ట్రాక్ చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించాడు. ఆశ్చర్యంగా తన వస్తువు ను దొంగించిన వ్యక్తి గోవాలో వినియోగిస్తున్నట్లు కనుగొన్నారు. ఈ విషయంలో తనకు సాయం చేయాలని  నెటిజన్లను కోరాడు. 

నిందితుడి చిరునామాను Xలో షేర్ చేశాడు. ఖరీదైన ఎయిర్ పాడ్ ను పొందేందుకు డిజిటల్ డిటెక్టివ్ లుగా తనకు సాయం చేయాలని కోరాడు. నిఖిల్ కు సాయం చేసేందుకు చాలా మంది నెటిజన్లు ముందుకు వచ్చారు. కొందరు ఎయిర్ పాడ్ లను తీసుకున్నవారి ఇంటిని కూడా ట్రేస్ చేశారు. ఆ ప్రాంతంలో తమకు తెలిసిన వారు ఎవరైన ఉంటే తప్పకుండా ఎయిర్ పాడ్ లను నిఖిల్ కు అప్పగిస్తామని చెప్పారు. ఎయిర్ పాడ్ లను తీసుకున్నవారి వివరాలు ఉన్నందున ఆన్ లైన్ లో E FIR  ఫైల్ చేయాలని సలహా ఇచ్చారు.