నీ తెలివికి హ్యాట్సాప్ బాస్.. కాఫీ షాపులోనే కూర్చుని.. జొమాటోలో ఆర్డ‌ర్..

నీ తెలివికి హ్యాట్సాప్ బాస్.. కాఫీ షాపులోనే కూర్చుని.. జొమాటోలో ఆర్డ‌ర్..

తెలివి ఎవడబ్బ సొత్తు కాదు.. ఈ టెక్నాలజీ యుగంలో.. అని నిరూపించాడు ఈ కుర్రోడు. అవసరానికి తగ్గట్టుగా తెలివిగా ఉపయోగించుకుంటే దాని కిక్కే వేరు.. ఇలాంటిదే అమలు చేసి చూపించాడు ఇతను.. దేశంలో అత్యంత ఖరీదైన కాఫీ షాపు స్టార్ బక్స్.. ఇక్కడ కాఫీ తాగాలని అనుకున్నాడు.. తాను తాగాలనుకున్న కాఫీ ధర రూ.400.. అదే కాఫీని జొమాటాలో ఆర్డర్ చేస్తే ఆఫర్ కింద రూ.190 వస్తుంది. ఐడియా బాగుందని.. ఇంటికి ఆర్డర్ ఇవ్వలేదు.. ఏకంగా స్టార్ బక్స్ కాఫీ షాపుకు వచ్చి.. ఆ షాపులోనే చల్లని ఏసీకి కింద.. కుర్చీలో కూర్చుని.. జొమాటో ద్వారా ఆర్డర్ చేశాడు. అడ్రస్ కూడా అదే కాఫీ షాపుకు ఇచ్చాడు.

ట్విట్టర్ యూజర్ సందీప్ మాల్ ఈ ఆసక్తికరమైన కథనాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. తాను జొమాటో ద్వారా ఆర్డర్ చేసినప్పుడు స్టార్‌బక్స్‌లో రూ.400 విలువైన కాఫీని రూ.190కి పొందానని చెప్పాడు. డెలివరీ పార్ట్ నర్ కౌంటర్ నుంచి కాఫీని తీసుకుని తన టేబుల్‌పై ఎలా ఉంచారో కూడా అతను వెల్లడించాడు. "స్టార్‌బక్స్‌లో కూర్చొని రూ.400కి విలువైన కాఫీని.. జోమాటో డీల్ లో రూ.190 కే వచ్చింది. స్టార్‌బక్స్ చిరునామాతో జొమాటోలో ఆర్డర్ చేశాను. Zomato వ్యక్తి  కాఫీని తీసుకుని తన టేబుల్ వద్దకు వచ్చి ఇచ్చాడు".

ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పలు ప్రశ్నలతో కామెంట్లు పెడుతున్నారు. డెలివరీ చేసే వ్యక్తి రియాక్షన్ ఏంటీ అని ఒకరు అడగగా.. దానికి మాల్ బదులిస్తూ కేఫ్‌లో కూర్చున్నప్పుడు ప్రజలు Zomato నుంచి ఆర్డర్ చేస్తారని డెలివరీ వ్యక్తికి ముందే తెలుసు, కాబట్టి అతను ఆశ్చర్యపోలేదని చెప్పాడు. మరో ట్విటర్‌ యూజర్‌ ఓ ఆసక్తికర విషయం చెప్పారు. "తక్కువ సమయంలో డెలివరీ KPIలు టిక్ అవుతున్నందున Zomato డెలివరీ చేసే వ్యక్తి సంతోషంగా ఉండాలి" అని అన్నారు.

మాల్ చేసిన ట్వీట్‌కు ట్విట్టర్‌లో చాలా కామెంట్లు వచ్చాయి. చాలా సేపు రెస్టారెంట్‌లో కూర్చొని డెలివరీ యాప్‌ల నుంచి ఆర్డర్ చేస్తున్నానని ఓ ట్విట్టర్ యూజర్ రాసుకొచ్చారు. ఇక మాల్ ను మేధావి అంటూ చాలా మంది నెటిజన్లు కొనియాడుతున్నారు. ఎందుకంటే ఇది నిజంగా డబ్బు ఆదా చేయడానికి తెలివైన మార్గం. కాగా ఈ విషయంపై స్టార్‌బక్స్ ఇంకా స్పందించలేదు.

https://twitter.com/SandeepMall/status/1666097047240577027