ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం బైక్ పై స్టంట్.. ఆ తర్వాత ఏమైందంటే..?

ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం బైక్ పై  స్టంట్.. ఆ తర్వాత ఏమైందంటే..?

చేతిలో బైక్ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరూ హీరోలా ఫీలవుతూ ఉంటారు. ఆ బైక్ (bike)పై విన్యాసాలు చేస్తూ.. ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటారు.కొంతమంది జనాలు తాము ఏదో సాధిద్దామనుకొని ఇతరులకు హాని కలిగేలా వ్యవహరిస్తారు.  ఒక్కోసారి వారిని కొట్టేందుకు కూడా సిద్దపడతారు.  రోడ్డు ఖాళీగా ఉన్నా.. బిజీగా ఉన్నా.. వారు బైక్ లపై చేసే విన్యాసాలు స్టంట్స్ మాత్రం ఆగవు.  కొంతమంది చేసే మూర్ఖత్వపు పనులు చేసి వారి శాడిజాన్ని ప్రదర్శిస్తుంటారు.  ఇప్పుడు అలానే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.  

అయినా నేటి తరం యువతకు బైకులపై ఉండే క్రేజ్ అంతో ఇంతో కాదు. వారి చేతిలో బండి ఉంటే రయ్ రయ్ మంటూ దూసుకెళ్తారు. ప్రమాదకర స్టంట్స్  చేస్తూ రెచ్చిపోతూ ఉంటారు. ఇలాంటి వీడియోలు మనం ఇదివరకు ఎన్నో చూసి ఉంటాం. కొంతమంది మూర్ఖులు  రీల్స్ కోసం బైక్ లపై ప్రయోగాలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు.  తాజాగా rahul_jat_bhdala  ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియోను పోస్టు చేశారు. 

వైరల్ అవుతున్న  వీడియోలో ఏముందంటే ..   ఓ వ్యక్తి మూర్ఖత్వానికి మరికొంతమంది ఇబ్బంది పడ్డారు.  రోడ్డుపై ఏదో ర్యాలి జరిగి.. రహదారి పక్కన జనాలు గమిగుడారు.  ఆ సమయంలో బైక్ పై ఓ వ్యక్తి విన్యాసాలను ప్రదర్శించాడు. అదికాస్తా అదుపు తప్పడంతో బ్యాలెన్స్ చేయలేకపోయాడు.  కిందకు దిగేందుకు ప్రయత్నిస్తూ కిందపడ్డాడు.   కాని బైక్ మాత్రం దూసుకుపోతూ... రోడ్డుకు అవతలి వైపున వస్తున్న రెండు బైక్ లను ఢీకొంది.  దీంతో వారిద్దరూ కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి.  ఈ స్టంట్ చూసిన జనాలు ఇలాంటి  మూర్ఖత్వపు  స్టంట్స్ ఎందుకని తిట్టిపోశారు.  ఇతరులకు ఇబ్బంది కలిగే స్టంట్స్ అవసరమా అని అతడి మూర్ఖత్వం గురించి  చర్చించుకుంటున్నారు.