పాపతో ఉండడానికి జాబ్ కు రిజైన్ చేసిండు

పాపతో ఉండడానికి  జాబ్ కు రిజైన్ చేసిండు

న్యూఢిల్లీ: పుట్టబోయే తన చిట్టిపాపతో టైం స్పెండ్​ చేసేందుకు తండ్రి ఏకంగా కోట్ల రూపాయల శాలరీ ఉన్న జాబ్​కే రిజైన్​ చేశాడు. ఖరగ్​పూర్​లో ఐఐటీ చదివిన అంకిత్​ జోషి, సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్ హోదా ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు. హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అంకిత్ వెల్లడించారు. ‘‘నేను సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ హోదాలో కొన్ని నెలల కిందే జాబ్​లో చేరాను. నా వైఫ్​ డెలివరీ అయ్యే కొన్ని రోజుల ముందే ఉద్యోగానికి రిజైన్​ చేశా. పుట్టబోయే బిడ్డకు టైం ఇవ్వాలనుకునే ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నా. నేను జాయిన్​ అయిన ఉద్యోగంలో భాగంగా వేర్వేరు నగరాలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు నా పాపకు టైం ఇవ్వలేనని భావించాను. చాలా మంది జాబ్​ వదులుకోవద్దన్నారు. కానీ నా భార్య ఆకాంక్ష మాత్రం నా నిర్ణయాన్ని స్వాగతించింది”అని అంకిత్​ జోషి చెప్పాడు. కూతురు పుట్టి నెల రోజులైందని, తన చేతుల్లోనే పాప పడుకుంటున్నదని, జాబ్​లో ఉండి ఉంటే ఇలాంటి ప్రేమకు దూరం అయ్యేవాడిని అని అంకిత్​ జోషి వివరించాడు. పాటలు పాడుతూ కూతురును పడుకోబెడుతున్నట్టు చెప్పాడు. ఇప్పటికైతే జాబ్​లో జాయిన్​ అయ్యే ఆలోచన లేదని, ఇంకొన్ని నెలలు కూతురుతో గడిపిన తర్వాత కొత్త ఉద్యోగానికి అప్లై చేస్తానని వివరించాడు.