పిల్ల దొరుకుడే కష్టం అనుకుంటుంటే.. వీడు లవర్ కు 15 కండీషన్స్ పెట్టాడు..

పిల్ల దొరుకుడే కష్టం అనుకుంటుంటే.. వీడు లవర్ కు 15 కండీషన్స్ పెట్టాడు..

ప్రేమ.. అనేది నమ్మకం విశ్వాసం పైనే ఆధారపడి ఉంటుంది. అది స్నేహితులైనా.. లవర్స్ అయినా.. తోటి ఉద్యోగులైనా సరే ఒకరిని మరొకరు నమ్మితేనే వారి బంధం సజావుగా ఉంటుంది.  కాని ఇందులో షరతులు , డిమాండ్లు వస్తే మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే.. ప్రస్తుతం ప్రియుడు, ప్రియురాలి మధ్య నున్న ప్రేమ బంధం ఒకరిది.. మరొకరికే  సొంతం అంటే కొన్ని విషయాల్లో మాత్రం సరిపోతుంది.  కాని అక్కర్లేని షరతులు విధిస్తే మాత్రం వారి బంధానికి బీటలు ఏర్పడినట్లే.  ఇప్పుడు తాజాగా ప్రియుడు.. ప్రియురాలికి 15 డిమాండ్లు పెట్టిన వార్త సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. 

ఎవరైనా ఇద్దరి మధ్య బంధం నిలవాలంటే వారు ఒకరినొకరు అర్దం చేసుకోవాలి. ఒకరిని .. మరొకరు నమ్మాలి. స్నేహితులైనా.. జీవిత భాగస్వాములైనా.. ఇక లవర్స్ అయినా సరే ఒకరిపై మరొకరికి విశ్వాసవ ఉంటేనే  ఆ బంధం .. అన్యోన్యంగా కొనసాగుతుంది.  ఇద్దరి మనుషుల మధ్య విబేధాలు వచ్చినా.. రెండు మనస్సుల మధ్య చిన్న చిన్న మనస్పర్దలు కలిగినా ఆ బంధానికి బీటలు ఏర్పడుతాయి.  ప్రస్తుత కాలంలో పిల్ల దొరకడమే కష్టంగా ఉంటే..  ప్రియురాలికి ప్రియుడు  కొన్ని కండీషన్లు పెట్టాడు.  

వారిద్దరిలో  ఇద్దరిలో ఎవరికైనా.. అనుమానం మొదలైన… ఆ బంధానికి స్వస్తి పలకాల్సిందే. అయితే ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య అర్థం చేసుకునే స్వభావం ఉంటే.. ఆ ప్రేమ.. వివాహం వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రేమలో అనుమానం ఉంటే మాత్రం.. మధ్యలోనే బంధం విడిపోతుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నప్పుడు ప్రియురాలిపై అనుమానం కలిగితే..ఇక అంతే సంగతులు. సాధారణంగా.. తన ప్రేయసిపై అనుమానం ఉన్నవారు.. వారిని అనుసరించడం.. వారి ప్రతి కదలికపై నిఘా పెడుతుంటారు. కొందరు నేరుగా వారితో గొడవ పెట్టుకుంటుంటారు. కానీ ..  బాయ్ ఫ్రెండ్ తమ రిలేషన్ కొనసాగాలంటే ప్రియురాలికి 15  నియమాలను అనుసరించాల్సి ఉంటుందని చెప్పాడట. అందుకు ఓ జాబితాను కూడా ఇచ్చాడట. ఆ నోట్‏ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆ నోట్ చూసిన నెటిజన్లు షాకయ్యారు. ఇప్పటికీ ఇలాంటి వారు కూడా ఉన్నారా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆ  బాయ్ ఫ్రెండ్ కంట్రోలింగ్ స్వభావం గురించి ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రోల్ అవుతుంది.   అతను విధించిన 15 డిమాండ్లు  ఏంటో తెలుసుకుందామా

  • ఆమె ఎత్తు 5'6 కాని.. దానికంటే కొంచెం తక్కువ హైట్ కలిగి ఉండాలి.
  • జుట్టు రంగు సహజంగా ఉండాలి కళ్లు నీలం రంగులో కాని ఆకుపచ్చగా కాని ఉండాలి
  • శరీరంపై టాటూ లాంటివి ఉండకూడదు.
  • బయట తినడం.. తాగడం లాంటివి చేయకూడదు
  • బిగుతు దుస్తులు ధరించకూడదు.. క్రాప్ టాప్ ధరించకూడదు
  • ఆల్కహాల్ తాగకూడదు.. ధూమపానం చేయకూడదు 
  • ఆమె తండ్రితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి.
  • తనతో ఎప్పుడూ ఏ విషయంలోనూ వాదించకూదు  
  • చదువుపట్ల కాని ఉద్యోగం పట్ల కాని ఆసక్తి  ఉండాలి. 
  • సోషల్ మీడియాలో పబ్లిసిటీ అవకూడదు
  • ఐదుగురు మగ సంతానాన్ని ఇవ్వాలి
  • అబ్బాయిలతో మాట్లాడకూడదు.. మగవారు  స్నేహితులు ఉండకూడదు
  • ఎక్కడికి వెళ్లినా  రాత్రి 9 గంటల కల్లా తిరిగి రావాలి
  • తాను ఇచ్చిన ఉంగరాన్ని ఎప్పటికీ తీయకూడదు
  • ఎలాంటి పార్టీలకు వెళ్లకూడదు 


ఓ యువకుడు మాత్రం తనతో ప్రేమలో కొనసాగాలంటే..  ఇలాంటి 15 రూల్స్‏ను కచ్చితంగా పాటించాలని షరతు విధించాడు. ఈ నియమాలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అతడితో బంధాన్ని ముగించుకోవాలని ఆమె ఆలోచిస్తున్నట్లుగా  తెలిపింది. కానీ.. ఆ విషయంపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఇక  అదే నిర్ణయాన్ని తీసుకోవడం మంచిదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.