భూ వివాదం... తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అన్న

భూ వివాదం... తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అన్న

తన తమ్ముడిపైనే సొంత అన్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ సంఘటన సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  కంసాలి బజార్ లో ఉంటున్న అన్నదమ్ములు శ్రీనివాస్,  వినోద్ ల మధ్య భూవివాదం కారణంగా.. ఇద్దరు ఘర్షణకు పడ్డారు.

ఈ క్రమంలో కోపంతో రగిలిపోయిన అన్న వినోద్.. తమ్ముడు శ్రీనివాస్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే శ్రీనివాస్ ను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.