ఎయిర్ గన్ మిస్ ఫైర్.. ఐదేళ్ల చిన్నారి బలి

ఎయిర్ గన్ మిస్ ఫైర్.. ఐదేళ్ల చిన్నారి బలి

తెలిసి తెలియని వయసులో ఓ చిన్నారి వాళ్ల అంకుల్ తుపాకికి బలైంది. పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లాలోని పాండువాలో శనివారం విషాదం జరిగింది.  ఐదేళ్ల చిన్నారి జుమానా హయత్ ఇంట్లో ఉన్న తన అంకుల్ ఎయిర్ గన్ తో ఆడుకోవడాన్ని కుటుంబసభ్యులు ఎవరూ గమనించలేదు. ప్రమాదవశాత్తు గన్ ఫైర్ అయి పాప ఛాతిలో బులెట్ తగిలింది. జుమానాను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలే.. చిన్నారి చనిపోయింది. ఒక్క ప్రమాదంతో ఆ పాపకు వందేళ్ల నిండిపోయాయి. ఈ ఘటన చిన్నారి కుటుంబంలో కన్నీళ్లనే ముగిల్చింది.

ALSO READ :- ఆమెరికాలో హెలికాప్టర్ క్రాష్ ... యాక్సెస్‌ బ్యాంక్‌ సీఈవో మృతి