రోడ్లపై గుంతలను నూడిల్స్ తో పూడ్చుతున్న వ్యక్తి.. వినూత్న రీతిలో నిరసన..

రోడ్లపై గుంతలను నూడిల్స్ తో పూడ్చుతున్న వ్యక్తి.. వినూత్న రీతిలో నిరసన..

రోడ్లపై గుంతలు కామన్.. ఇండియాలో అయితే సర్వసాధారణం.. వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లపై గుంతలు కాదు.. గుంతల రోడ్లపైనే ప్రయాణం చేస్తారు వాహనదారులు. గుంతల్లో పడి ఎంతో మంది టూవీలర్స్ చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.. రోడ్లపై గుంతలను పూడ్చాలని.. గుంతలు లేని రోడ్లు ఉండాలనే సంకల్పం తీసుకున్నారు బ్రిటన్ కు చెందిన మార్క్ మోరెల్. పదేళ్లుగా ఇతను చేస్తున్న నిరసన.. ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది.

మార్క్ మోరెల్ ఓ రిటైర్డ్ అధికారి. అతన్ని సరదాగా గుంతల మనిషి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. పదేళ్లుగా రోడ్లపై గుంతలను పూడ్చుతూ.. వాటి వల్ల జరిగే ప్రమాదాల గురించి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అదే విధంగా రోడ్లపై ఉన్న గుంతల వల్ల ప్రమాదాలకు గురయ్యి గాయపడిన, మరణించిన వారి కుటుంబాలను కలిసి వారి బాధలను ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు. 

పదేళ్లుగా మార్క్ మోరెల్ ప్రచారం చేస్తున్నారు కదా.. ఇప్పుడు మళ్లీ ఎందుకు హైలెట్ అయ్యారు అంటారా.. అక్కడికే వస్తున్నాం. గతంలో గుంతల్లో బర్త్ డే కేక్స్, ప్లాస్టిక్ బాతులు అంటూ వేసేవారు. ఇప్పుడు మాత్రం నూడిల్స్ పోస్తున్నారు. గుంతలను నూడిల్స్ తో పూడ్చుతున్నారు. నూడిల్స్ ఎంత సేపు ఉంటాయి అని ప్రశ్నిస్తే.. ఇప్పుడు మీరు ఆశ్చర్యంగా చూశారు.. విన్నారు కదా.. అదే విధంగా ఈ విషయం ప్రభుత్వం వరకు వెళ్లాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అంటున్నారు మార్కెల్.

ఇంగ్లాండ్ లో పాట్ నూడిల్స్ ఎంతో ఫేమస్.. ఆ నూడిల్స్ ను రోడ్లపై గుంతల్లో నింపుతున్నాడు. మార్క్ మోరెల్ ఈసారి ఎంచుకున్న వైవిధ్యమైన ఐడియాతో.. ప్రభుత్వం సైతం స్పందించింది. గుంతలను పూడ్చటం అనేది నిరంతర ప్రక్రియ అని.. సమాచారం వచ్చిన వెంటనే రోడ్లు బాగుచేస్తున్నామని చెబుతుంది. వాహనదారులు కౌంటర్ ఇస్తున్నారు ప్రభుత్వానికి. గుంతలను పూడుస్తున్నట్లయితే మార్క్ నూడిల్స్ ఎక్కడ పోస్తున్నారో చూస్తున్నారా.. ఆయన నూడిల్స్ తో గుంతలు పూడ్చుతున్నారు.. అవి కనిపించటం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు..

మొత్తానికి ప్రపంచంలోనే ఫస్ట్ టైం.. రోడ్ల గుంతలను నూడిల్స్ తో పూడ్చటం..