నరరూప రాక్షసుడు.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం

నరరూప రాక్షసుడు.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం

హైదరాబాద్ ఎల్బీనగర్ లో దారుణం  జరిగింది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై శ్రీకాంత్ అనే కామాందుడు అరాచకానికి పాల్పడ్డాడు.చిన్నారిని బాత్ రూంలోకి తీసుకెళ్ళి అత్యాచార యత్నం చేశాడు. చిన్నారి అరుపులుతో తల్లి బాత్ రూం వద్దకు వెళ్లి చూసింది. లోపల నుంచి అరుపు లు వస్తుండటంతో గట్టిగా బాత్ రూం డోర్ ను  తన్నింది. దీంతో అలర్ట్ అయిన శ్రీకాంత్ తల్లిని తోసేస్తూ బాత్ రూంలోంచి బయటకు పరుగు తీశాడు. 

ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియని తల్లిదండ్రులు దిక్కు తోచని స్థితిలో గడిపారు.10రోజుల క్రితమే వారు ఏపీ నుండి హైదరాబాద్ కు బతుకుదెరువు కోసం వచ్చినట్టు తెలుస్తుంది. నిందితుడు జిహెచ్ఎంసి లో వర్కర్ గా పనిచేరుస్తున్నట్లు సమాచారం.