భారీ వరదల్లో దుంగపై ప్రయాణం... విహార యాత్ర మాదిరిగా వెళ్తున్న వ్యక్తి..

భారీ వరదల్లో  దుంగపై ప్రయాణం...  విహార యాత్ర మాదిరిగా వెళ్తున్న వ్యక్తి..

సాధారణంగా భారీగా వర్షాలు కురిసినా, వరదలు వచ్చినా జనాలు ఇళ్లలోంచి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎవరైనా పడవల్లో వచ్చి సాయం చేస్తే తప్పు బయటకు రాలేరు. ముఖ్యంగా తమకు కావాల్సిన సరుకులను కూడా రెస్క్యూ సిబ్బంది వాళ్లే అందిస్తుంటారు. సహాయక సిబ్బంది చర్యలతోనే ప్రజలు సమస్యలు కాస్త తీరుతుంటాయి. కానీ ఓ వ్యక్తి మాత్రం భారీ వరదల్లోనూ భలేగా ప్రయాణం చేస్తున్నాడు. కారులో, విమానంలో వచ్చినంతగా హాయిగా వచ్చేస్తున్నాడు. అలా అని అతను వచ్చేదేదో పెద్ద బోట్ అనుకునేరు. అదేం కాదండి.. ఓ కర్ర దుంగపై కూర్చొనే తనకు నచ్చిన చోటుకు వెళ్తున్నాడు. కావాల్సినవి కొనుక్కుంటున్నాడు. అతను వెళ్తున్న తీరు చూస్తుంటే ముక్కున వేలు వేసుకోకుండా ఉండలేరు. ఎందుకూ అంటారా..!

భారీ వర్షాలు, వరదలు వస్తే ఇళ్లలో నుంచి బయటకు రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది.ఎవరైనా వచ్చి సహాయం అందించాల్సిందే.అయితే ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెస్క్యూ సిబ్బంది సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఉంటారు.వరదల్లో చిక్కుకున్న వ్యక్తుల కోసం ఆహార పదార్థాలు, సరుకులు లాంటివి విమాన సహాయంతో అందిస్తున్న విషయాలను అప్పుడప్పుడు వినే ఉంటాం. అయితే ఓ వ్యక్తి భారీ వరదల్లో కూడా ఎంతో హాయిగా, దర్జాగా ప్రయాణిస్తూ చూసే వారందరినీ ఆశ్చర్యపరిచాడు.

 ఒక కర్ర దుంగపై  కూర్చొని వరదకు గురైన వీధుల్లో ప్రయాణించాడు.తనకు అవసరమైన చోటికి వెళ్లి అవసరమైనవి కొనుక్కొని దర్జాగా ఇంటికి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతూ వీడియోలను తీశారు.  ఆ వీడియోలో ఓ వ్యక్తి మనిషి మునిగిపోయే స్థాయి వరకు వచ్చిన వరద నీటిలో ఓ పెద్ద కర్ర దుంగను పడవ లాగా నడుపుతున్నాడు.ఒక చేతిలో కర్ర పట్టుకొని అడ్డుగా వచ్చే వాటిని పక్కకు జరుపుకుంటూ నచ్చిన చోటికి వెళ్తున్నాడు.తనకు కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నాడు.అలాగే మెడికల్ షాపు వద్దకు వెళ్లి తనకు కావాల్సిన మందులు కొని ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు.

ఆ వ్యక్తి వాటర్ తాగుతున్నప్పుడు అక్కడ ఉండే వారంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అతని వద్ద ఉండే డబ్బులు నాని పోకుండా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టుకున్నాడు.ఈ వీడియోను చూసిన వారందరూ భలేగా ప్రయాణిస్తున్నాడని కొనియాడారు.కొంతమంది ఇతడి తెలివిని అభినందిస్తూ సమస్యలు వచ్చినపుడు కృంగిపోకుండా ధైర్యంగా ఆలోచించి ముందు అడుగు వేయడం ఇలాంటి వారిని చూసి నేర్చుకోవాలని ఆ వ్యక్తిని ప్రశంసిస్తున్నారు.

163.3కే వ్యూస్ తో దూసుకెళ్తున్న వీడియో

ఈ వీడియోని Hasna Zaroori Hai అనే నెటిజెన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. షేర్ చేయగా.. ఇప్పటి వరకు  ( వార్త రాసే సమయానికి) 163.3కే వ్యూస్ వచ్చాయి. అలాగే వేలల్లో లైకులు, వందల్లో కామెంట్లు చేశారు. టూ గుడ్ మ్యాన్, నాచురల్ బండి అంటూ రాసుకొస్తున్నారు. ఐడియా అదిరింది గురూ అని కొందరు, కోటీశ్వరులు కూడా ఇలాంటి రైడ్ ను ఎంజాయ్ చేయలేరని మరికొంత మంది చెప్పుకొస్తున్నారు. మీరూ ఈ ఈడియోపై ఓ లుక్కేయండి.