చికెన్ రేటు ఎక్కువ చెప్పాడని.. పొడిచి చంపిన అన్నదమ్ములు

చికెన్ రేటు ఎక్కువ చెప్పాడని.. పొడిచి చంపిన అన్నదమ్ములు

చికెన్ రేటు ఎక్కువ చెప్పాడని షాపు యజమానిని కత్తితో పొడిచి చంపిన ఘటన ఢిల్లీలో జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని మదీనాపూర్ జిల్లాలోని కేశార్‌పూర్ జల్పాయి గ్రామానికి చెందిన షిరాజ్ ఢిల్లీలోని జహంగీర్పూర్ ప్రాంతంలో చేపలు అమ్మి జీవినం సాగిస్తున్నాడు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో చేపల వ్యాపారం సరిగా సాగకపోవడంతో చికెన్ అమ్మడం కూడా ప్రారంభించాడు. ఇందుకోసం తన ఇంటి ముందు ఒక బండిని పెట్టి అందులో చేపలు, చికెన్ అమ్ముతున్నాడు.

బుధవారం షిరాజ్ బండి దగ్గరకు షా ఆలం అనే వ్యక్తి చికెన్ కోసం వచ్చాడు. చికెన్ రేట్ ఎంత అని అడగడంతో.. షిరాజ్ రేట్ చెప్పాడు. దాంతో షా ఆలం చికెన్ ఎక్కువ ధరకు అమ్ముతున్నావంటూ షిరాజ్ తో గొడవకు దిగాడు. చిన్న చిన్నగా గొడవ పెద్దదైంది. అంతలోనే అక్కడికి వచ్చిన షా ఆలం సోదరులు కూడా షిరాజ్ తో గొడవకు దిగారు. ఒక్కసారిగా కోపోద్రిక్తులైన షా ఆలం మరియు అతని సోదరులు రాడ్లు మరియు కత్తితో షిరాజ్ పై దాడి చేశారు. షా ఆలం కత్తితో షిరాజ్ ను పొడిచాడు. గాయాలపాలైన షిరాజ్ ను మంగోల్‌పురిలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే షిరాజ్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

‘బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ సంఘటన గురించి మాకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశాం. షిరాజ్ చికెన్ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడని షా ఆలం మరియు అతని సోదరులు షిరాజ్ తో గొడవకు దిగారు. ఆ గొడవ వల్లే షిరాజ్ పై దాడి చేశారు. ఆ దాడిలో కత్తిపోట్లకు గురైన షిరాజ్ చనిపోయాడు. కేసు నమోదు చేసి షా ఆలంను అరెస్టు చేశాం. మిగతా వారికోసం గాలిస్తున్నాం’ అని డిప్యూటీ పోలీసు కమిషనర్ విజయంత ఆర్య తెలిపారు.

For More News..

పోలీసులు లాక్డౌన్ డ్యూటీలో.. దొంగలు తమ పనిలో..

మందుకోసం పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని 19 ఏళ్ల కొడుకుని..

బస్సును మొబైల్ ఫీవర్ క్లినిక్‌గా మార్చిన ఆర్టీసీ