
అధిక వడ్డీ కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్టా జిల్లా మచిలీపట్నం సర్కారు తోటలో జరిగింది. తోపుల నాగ భాను ప్రకాశ్ (27) అనే అతను సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియోలో తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తాను అఖిల్ అనే అతని దగ్గర అప్పుతీసుకున్నట్లు తెలిపాడు. అయితే అప్పు ఇచ్చేటప్పుడు ఐదు రూపాలయల వడ్డీ అని చెప్పి వసూలు చేసేటప్పుడు మాత్రం 10రూపాయల వడ్డీని తీసుకుంటున్నారని అన్నారు. అధిక వడ్డీని తాను కట్టలేనని అఖిల్, అతని నాన్నకు చెప్పినట్టు తెలుపగా వారు ఒప్పుకోలేదనా చెప్పాడు భాను ప్రకాశ్. దీంతో పాటే.. తనను రోడ్డు మీద అవమానించి తన బైక్ ను అఖిల్ తీసుకెళ్లాడని చెప్పాడు. అధిక వడ్డీని భరించలేని తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని వీడియో లో తెలిపాడు భానూ ప్రకాష్. తన ఆత్మహత్యకు కారణం అఖిల్, అతని తండ్రి అని చెప్పాడు. తాను కొందరి ఫ్రెండ్స్ కు కొంత మనీని ఇచ్చానని వారి నుంచి ఆ ధనాన్ని ఎవరైనా తీసుకుని తన అమ్మకు ఇవ్వాలని కోరాడు.
భానూ ప్రకాష్ ఓ చర్చిలో ఆత్మ హత్య చేసుకున్నాడు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా పోస్ట్ మార్టం నిర్వహించారని అతని తరపు బంధువులు ఆరోపించారు. అనుమానం వచ్చి అతని మొబైల్ ఫోన్ ను చెక్ చేయగా.. తన సూసైడ్ వీడియో వెలుగులోకి వచ్చింది.