ఎయిర్ పోర్ట్ లో బహిరంగంగా మూత్రవిసర్జన.. మండిపడుతున్న నెటిజన్లు

ఎయిర్ పోర్ట్ లో బహిరంగంగా మూత్రవిసర్జన.. మండిపడుతున్న నెటిజన్లు

విమానాశ్రయంలో ఓ వ్యక్తి తుంటరి పనిచేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సాధారణంగా విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతతో పాటు మూత్రవిసర్జన చేసేందుకు, ఫ్రెషప్ అయ్యేందుకు రెస్ట్ రూమ్ లు ఉంటాయి.

అయితే ఆ ఎయిర్ పోర్ట్ లో అలాంటి సౌకర్యాలు లేనట్లు ఓ వ్యక్తి విమానాశ్రయంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. అయితే నిందితుడు మూత్రవిసర్జన చేస్తున్న సమయంలో ఓ నెటిజన్ వీడియో తీసి  సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

బహిరంగ మూత్రవిసర్జన చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగిన మైకంలో ఇలా చేసి ఉంటాడని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేసుకుంటుంటే..మరికొందరు వయోభారంతో కదల్లేక ఈ పనిచేసి ఉంటాడని మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు.

పాసింజర్ షేమింగ్ అనే ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆ వీడియోను 2లక్షలకు పైగా వీక్షించగా 5వేల మంది లైక్ చేశారు.