
పాల్వంచ, వెలుగు: తన భార్య పుట్టింటికి వెళ్లి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన బజ్జర ప్రసాద్(30) తాగుడుకు బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో కొద్ది రోజుల క్రితం భార్య సంధ్య పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లింది. లాక్ డౌన్ ప్రారంభం నుంచి అక్కడే ఉండిపోయింది. ఆదివారం భార్యకు ఫోన్ చేసిన ప్రసాద్ ఇంటికి రమ్మని కోరాడు. తాగుడు మానేస్తేనే వస్తానంటూ సంధ్య చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తల్లి కమలమ్మ చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి కొత్తగూడెంకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
రంజాన్ పూట విషాదం
ఇల్లెందు, వెలుగు: పండుగ పూట భార్య రాలేదన్న మనోవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఇల్లెందులోని స్కూల్ ఏరియాలో ఉంటున్న ఎస్ కె.బాసిత్ (35) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం భార్య కరీమ ఇంట్లో గొడవ పెట్టు కొని పుట్టింటికి వెళ్లిపోయింది. పండుగ పూట భార్యాపిల్లలు లేరన్న మనోవేదనతో బాసిత్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుం బసభ్యులు హుటాహుటిన ఇల్లెందు గవర్నమెంట్ హాస్పిటల్ కు
తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. అతడికి కూతురు, కొడుకు ఉన్నారు.