
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) ఆధ్వర్యంలో రూపొందించిన ‘మన బతుకమ్మ– 2025’ పాట విడుదలైంది. టీజీటీడీసీ బుధవారం ఈ పాటను రిలీజ్ చేసింది. ప్రముఖ ప్రజాకవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అద్భుతమైన సాహిత్యం అందించగా.. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు. అదితి భవరాజు, మంగ్లీ, గోరటి వెంకన్న ఆలపించగా.. ఈశ్వర్ పెంటి (ప్రేమలో ఫేమ్) నృత్య రూపకల్పన చేశారు.
దర్శకుడు భద్రప్ప గాజుల ప్రతి సన్నివేశాన్ని సజీవ చిత్రంగా మలిచారు. శ్యామ్ దుపాటి, ఉదయ్ గుర్రాల (సినిమాటోగ్రఫీ) తెలంగాణ పల్లె దృశ్యాలు, పండుగ వైభవం చాటేలా అద్భుతంగా తెరకెక్కించారు. ‘ఓ తంగేడు పూల తల్లి బతుకమ్మ’ అంటూ సాగే ఈ పాటను తెలంగాణ ఆడపడుచులు ఆడి పాడుకునేలా రూపొందించారు.