హైదరాబాద్, వెలుగు: మేనేజ్డ్ వర్క్‌స్పేస్ ప్రొవైడర్ ఇంకుస్పేస్, వర్క్‌స్పేస్ ఆపరేటర్ ఐకెవాను 100 శాతం బై ఔట్ డీల్ ద్వారా కొనుగోలు చేసింది. 2029 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. వెయ్యి కోట్ల ఆదాయాన్ని సాధించాలనే లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది.
ఐకెవాకు హైదరాబాద్, బెంగళూరులలో 18 కేంద్రాలతో కూడిన ఐదు లక్షల చదరపు అడుగుల ఆఫీసు జాగా ఉంది. ఐపీఓకి సిద్ధమవుతున్న సమయంలో ఇంకుస్పేస్ ఐకెవాను దక్కించుకుంది.
