
వరుసగా నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. తన నుండి ముందుగా రాబోయే చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. పూజాహెగ్డే హీరోయిన్. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ వర్క్‌ని ఈ నెల నాలుగో వారంలో స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీ హిందీ వెర్షన్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకరైన మనన్ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఓ ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘బిగ్ డే కోసం వెయిట్ చేయండి. త్వరలోనే ఎమోషన్‌ని ఎక్స్‌పీరియెన్స్ చేయబోతున్నారు’ అంటూ క్యూరియాసిటీని పెంచాడు. తన కామెంట్‌ని బట్టి త్వరలోనే ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టు అర్థమవుతోంది. హిందీ వెర్షన్‌తో పాటు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న సౌత్ వెర్షన్ కూడా వస్తుందేమో చూడాలి. ఇదో పీరియాడికల్ ప్రేమకావ్యం అని మొదటి నుండి మేకర్స్ చెబుతున్నారు. ప్రేక్షకుల ఊహకందని సర్‌ప్రైజ్‌లు కూడా బోలెడు ఉన్నాయట. థ్రిల్ చేసే హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ప్రేక్షకులకు న్యూ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించే సినిమా అంటున్నారు. జులై 30న విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. కరోనాతో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వాయిదా పడ్డాయి కనుక రిలీజ్ డేట్‌లో కూడా మార్పులుంటాయేమో చూడాలి!