
దోహా: ఇండియా ప్లేయర్లు మానవ్ ఠక్కర్, మనికా బాత్రా.. వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో నిరాశపర్చారు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్‌లో మానవ్ ఠక్కర్ 2–4 (11–13, 3–11, 11–9, 6–11, 11–9, 3–11)తో వరల్డ్ నాలుగో ర్యాంకర్ హరిమోటో టొమోకాజు (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు.
ఆరంభంలో వెనకబడిన ఇండియన్ ప్లేయర్ మూడు, ఐదో గేమ్‌లో గట్టిపోటీ ఇచ్చాడు. వరుసగా బలమైన స్ట్రోక్స్ కొట్టి ఆధిక్యంలో నిలిచాడు. కానీ చివరి గేమ్‌ల్లో మళ్లీ తడబడ్డాడు. విమెన్స్ సింగిల్స్‌లో మనిక 0–4 (8–11, 7–11, 5–11, 8–11)తో వరల్డ్ 130వ ర్యాంకర్ పార్క్ గహియోన్ (సౌత్ కొరియా) చేతిలో కంగుతిన్నది.
మరో మ్యాచ్‌లో దియా చిటాలె 1–4 (3–11, 7–11, 6–11, 11–6, 5–11)తో చెంగ్ చియాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది.