మంత్రి వివేక్ ను కలిసిన మంచిర్యాల కాంగ్రెస్ లీడర్లు

మంత్రి వివేక్ ను కలిసిన మంచిర్యాల కాంగ్రెస్ లీడర్లు

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్​శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామిని మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు కలిశారు. కాంగ్రెస్ సీనియర్ ​లీడర్​ జగన్​మోహన్​ రావు ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని మినిస్టర్​క్వార్టర్​లో మంత్రి వివేక్​ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.

జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానన్నారు. పార్టీ బలోపేతానికి కాంగ్రెస్​ శ్రేణులందరకు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. మంత్రిని కలిసినవారిలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ పోతురాజుల రామచందర్, ఏఎంసీ మాజీ డైరెక్టర్లు​ పాయల్ చిన్నయ్య, తనువుల రాజమౌళి, డీఎఫ్​సీఎస్​ మాజీ చైర్మన్​సాకపురం శంకరయ్య తదితరులు ఉన్నారు.