ఎన్నికల నిర్వహణలో అలర్ట్గా ఉండాలి : కుమార్ దీపక్

ఎన్నికల నిర్వహణలో అలర్ట్గా ఉండాలి : కుమార్ దీపక్
  • జిల్లా ఎన్నికల అధికారి కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సోమవారం కలెక్టరేట్​లో అడిషనల్ ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, నోడల్ అధికారి శంకర్​తో కలిసి 1, 3వ విడతల స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బ్యాలెట్ నిర్వహణ, పోలింగ్, కౌంటింగ్ అంశాలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియ అనంతరం పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు, ఏర్పాట్ల పరిశీలన, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, పోలింగ్ రోజున ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన కల్పించారు. 

కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ, ఫలితాలు వంటి ప్రతి అంశంపై అలర్ట్​గా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి అనుమానాలున్నా శిక్షణ సమయంలో నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు హరిప్రసాద్, మధు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.