కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురి అరెస్ట్

V6 Velugu Posted on Apr 25, 2021

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికెరీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గనులు భూగర్భ శాఖ (మైనింగ్ డిపార్ట్ మెంట్) కు సంబంధించిన ఓ ఫైల్ పై కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం ద్వారా నిందితులు ముగ్గురు 1 కోటి 97 లక్షల 46 వేల 151 రూపాయలను స్వాహా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఈ అక్రమాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను ఆదివారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి ఎడి మైనింగ్ ఆఫీస్ కు సంబందించిన ఐసీఐసీఐ బ్యాంకు చెక్ బుక్స్, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ బుక్, స్టాంప్ ప్యాడ్స్, జిల్లా కలెక్టర్, ఎడి సంతకాల కాపీలు, గజిటెడ్ అధికారుల సంతకాలు చేసేందుకు ఉపయోగించిన గ్రీన్ పెన్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

 

Tagged mancherial district, , collector bharati hollikeri, collector signature, collector sign forgery case, mining department, three arrest.

Latest Videos

Subscribe Now

More News