
మంచిర్యాల: వైన్ షాప్ ముందు వాడేసిన ప్లాస్టిక్ గ్లాసులు చెత్త కుప్పగా పడి ఉండడం చూసిన కలెక్టర్ ఆ షాపు కు రూ.30,000 జరిమానా విధించారు. మంచిర్యాల జిల్లా మాదాపూర్ లో జరిగిందీ సంఘటన. 30 రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో పారిశుద్ధ్య పనులు జరిగాయి. జిల్లా కాలెక్టర్ భారతీ హోళీ కెరీ మ్యాదరిపేట,మాదాపూర్ గ్రామాల్లో పర్యటించి స్వయంగా ఆ పనుల్లో పాల్గోన్నారు.
మాదాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య పనుల్లో భాగంగా సాయిరాం వైన్స్ ఆవరణలో ప్లాస్టిక్ గ్లాసులు ఉండటంతో కలెక్టర్ ఆగ్రహించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచకుండా, చెత్తను నిల్వ ఉంచడంతో సాయిరాం వైన్స్ పై 30,000 రూపాయల జరిమాన విధించారు.