జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

నస్పూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించారు. శుక్రవారం సీసీసీ నస్పూర్​లోని ప్రాణహిత స్టేడియంలో సీపీఐ లీడర్ శంకర్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నల్ల సతీశ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ నిత్యం వారి పనుల్లో బిజీగా ఉంటారని

ఒత్తిడిని జయించడానికి ఇలాంటి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. 12 జట్లు పాల్గొనే ఈ పోటీలు ఈ నెల 26 వరకు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గని రవీందర్, కోశాధికారి శ్రీపతి రవి, ఆర్గనైజర్లు, 18 మండలాలకు చెందిన అసోసియేషన్ అధ్యక్షులు, క్రీడాకారులు పాల్గొన్నారు.