
సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసులు ఇద్దరు దుర్మరణం చెందారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవ్ కు చెందిన నాంపల్లి రాజు(24), జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన ఉప్పు మల్లేశ్( 40) రెండేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లారు. వర్క్ వీసా లేకపోవడంతో అక్కడ చాటుమాటుగా కూలీ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పని కోసం రాజు, ఉప్పు మల్లేష్ స్కూటీపై వెళ్తుండగా ఎదురుగా స్పీడ్‌గా వచ్చిన కారు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. నాంపల్లి రాజుకు చెల్లె, తమ్ముడు అమ్మానాన్న ఉన్నారు. మల్లేశ్‌కు భార్య, డిగ్రీ చదువుతున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతదేహాన్ని ఇండియాకు తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.