- ఫస్ట్ ర్యాంక్ సాధించిన శ్వేతకు రూ.2 లక్షలు అందజేయనున్న గవర్నర్
జన్నారం రూరల్, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించిన మంచిర్యాల జిల్లా జన్నారం ప్రభుత్వ స్కూల్ విద్యార్థినికి అరుదైన గౌరవం దక్కింది. రేండ్లగూడ గ్రామానికి చెందిన లసెట్టి శ్వేత గత విద్యాసంవత్సరం కిస్టాపూర్ హైస్కూల్లో టెన్త్పూర్తిచేసింది. వార్షిక పరీక్షల్లో 582 మార్కులతో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది.
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ చేపట్టిన ‘చదువుకో తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా శ్వేతకు రూ.2 లక్షల నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం అందజేయనున్నారు. ఈ నెల 24న హైదరాబాద్‌లోని జయభేరి ఫైన్, నర్సింగ్ బౌల్ వద్ద గల ఈ ఎస్ సీఐ క్యాంపస్‌లోని జరిగే కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేయనున్నట్లు స్కూల్ హెచ్ఎం గుండా రాజన్న తెలిపారు. ప్రస్తుతం శ్వేత మహబూబ్‌నగర్‌లోని ట్రిపుల్ ఐటీలో ఫస్టియర్ చదువుతోంది.
