- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అందుకున్న కలెక్టర్లు
మంచిర్యాల/ఆదిలాబాద్/నిర్మల్, వెలుగు: జల్‌సంచయ్ జన్ భాగీధారి స్కీమ్‌లో మెరుగైన ప్రగతి సాధించినందుకు మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు జాతీయ అవార్డులు లభించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్‌లో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కలెక్టర్లు కుమార్ దీపక్, రాజర్షి షా పురస్కారాలు అందుకున్నారు. జల్ సంచయ్ జన్ భాగీధారి స్కీమ్‌లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలు జాతీయ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఫస్ట్ కేటగిరిలో ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలు అవార్డుతో పాటు రూ.2 కోట్ల నగదు పురస్కారాన్ని దక్కించుకున్నాయి. ఈ స్కీమ్‌లో నిర్మల్ జిల్లా రెండో కేటగిరీలో నిలిచింది. ఈ సందర్భంగా మంగళవారం కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా కలెక్టర్ అభిలాష అభినవ్ అవార్డు స్వీకరించారు.
అవార్డు లభించడంపై కలెక్టర్ స్పందిస్తూ.. అధికారుల సమిష్టి కృషి, ప్రజల విలువైన భాగస్వామ్యంతో ఈ విజయం సాధ్యమైందన్నారు. అవార్డు రావడానికి కృషిచేసిన అధికారులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
