మంచిర్యాల జిల్లా కవ్వాల్ రిజర్వ్ లో టైగర్ సఫారీ అక్టోబర్1 నుంచి ప్రారంభం..

మంచిర్యాల జిల్లా కవ్వాల్ రిజర్వ్ లో  టైగర్ సఫారీ అక్టోబర్1 నుంచి ప్రారంభం..

జన్నారం, వెలుగు : మంచిర్యాల జిల్లా కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఇయ్యాల్టి నుంచి టైగర్ సఫారీ ప్రారంభంకానుంది. వన్యప్రాణుల పునరుత్పత్తి సమయమైన జూన్ నుంచి సెప్టెంబర్ 30 వరకు సఫారీని నిలిపివేశారు.

 అక్టోబర్ 1 నుంచి సఫారీని తిరిగి ప్రారంభించేందుకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అనుమతి ఇచ్చింది. దీంతో అటవీశాఖకు చెందిన ఐదు, పర్యాటక శాఖకు చెందిన రెండు సఫారీ వాహనాలు సిద్ధం చేశారు. గోండుగూడ బేస్ క్యాంప్, వాచ్ టవర్, మైసమ్మకుంట, బైసన్ కుంట, గనిశెట్టి కుంటల మీదుగా సఫారీ సాగనుంది.