హైదరాబాద్: మంచు కుటుంబంలో విభేదాల వార్తలు ఆదివారం ఉదయం నుంచి అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మంచు మనోజ్, మోహన్‌బాబు నుంచి ఈ గొడవలకు సంబంధించి ఫిర్యాదులు అందలేదని తెలిసింది. ఎలాంటి దాడి జరగలేదని మోహన్‌బాబు పీఆర్‌వో వివరణ కూడా ఇచ్చారు. అయితే.. ఇందులో నిజం ఏంటంటే.. ఎవరు కాల్ చేశారనే విషయంలో స్పష్టత లేదు గానీ డయల్ 100 నంబర్కు మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి కాల్ వెళ్లింది. తమ కుటుంబంలో చిన్న విభేదాలు ఉన్నాయని మోహన్ బాబు కుటుంబ సభ్యులు కాల్లో పోలీసులకు చెప్పారు. దీంతో.. పోలీసులు హుటాహుటిన జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటికి వెళ్లారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని మోహన్ బాబు కుటుంబ సభ్యులకు పోలీసులు స్పష్టం చేశారు.
ఈ గొడవల గురించి మీడియాలో వార్తలు ప్రసారం కావడంతో మంచు కుటుంబం తమ పరువుమర్యాదలకు భంగం వాటిల్లుతుందని గ్రహించింది. అప్రమత్తమైన మోహన్ బాబు తన పీఆర్వోతో ఎలాంటి దాడి జరగలేదని, మీడియాలో అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారని జరిగిన ప్రచారంలో నిజం ఉందో.. లేదో గానీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల డయల్ 100కి మోహన్ బాబు కుటుంబం నుంచి కాల్ వెళ్లినట్లు పహాడీషరీఫ్ ఎస్ఐ వివరణతో స్పష్టమైంది.
ALSO READ | Sreeleela Marriage: శ్రీలీల పెళ్లి బాధ్యత నాదేనంటున్న బాలయ్యబాబు.. ఎందుకంటే..?
మంచు కుటుంబంలో విభేదాలు గతంలోనూ బయటపడ్డాయి. 2023, మార్చిలో కూడా మంచు బ్రదర్స్ గొడవ పడిన వీడియో ఒకటి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు, మంచు మనోజ్ గొడవ పడినట్లు ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. కానీ.. అదంతా ఒక రియాలిటీ షో కోసం చేశామని మంచు ఫ్యామిలీ అప్పట్లో చెప్పుకొచ్చింది. కానీ.. ఆ రియాలిటీ షో ఇంతవరకూ ప్రసారం కాకపోవడం కొసమెరుపు. అదంతా కవర్ డ్రైవ్ అని నెటిజన్లు తాజా గొడవల సందర్భంలో మరోసారి గుర్తుచేసుకున్నారు.
— తెనాలి రామకృష్ణుడు (@vikatakavi369) December 8, 2024