
జనసేన విజయం గురించి, పవన్ కళ్యాణ్ గెలుపు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు నటి, నిర్మాత మంచు లక్ష్మి. ఎన్ని తిట్టినా, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని పవన్ కళ్యాణ్ నిలబడ్డారని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు పవన్ అభిమానులు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మంచి లక్ష్మి నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ యక్షిణి. రాహుల్ విజయ్, వేదిక ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ను తేజ మర్ని తెరకెక్కించాడు. బాహుబలి మేకర్స్ ఆర్కా మీడియా నిర్మించిన ఈ సిరీస్ లో మంచు లక్ష్మి కీ రోల్ చేశారు. ఇటీవలే స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సిరీస్ మంచి ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక యక్షిణి ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు.
రాజకీయాలు అనేవి ఒక ప్రత్యేక ప్రపంచం. ఒక స్టార్ హీరోగా ఉంటూ, అంతమంది అభిమానులు ఆయన్ని ప్రేమిస్తుంటే అవన్నీ పక్కన పెట్టిసి రాజకీయాల్లోకి వెళ్లారు పవన్ కళ్యాణ్. ఆయనకు డబ్బు, ఫేమ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నిజం చెప్పాలంటే.. ఆయన ఫేమ్ ను వేరేవాళ్లు వాడుకుంటారు, వాడుకున్నారు కూడా. పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యామంటే అంతే.. మంచి చేసినా చెడుగా చెప్తారు. అలాంటివన్నీ తట్టుకొని, నిలదొక్కుకుని ఇక్కడివరకు వచ్చరాంటే అది మాములు విషయం కాదు.
ఈ చరిత్రాక విజయంతో పవన్ కళ్యాణ్ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. నేనెప్పుడూ నా ఒపినియన్ పబ్లిక్ గా చెప్పలేదు. కానీ, పవన్ కళ్యాణ్ మోటివేషన్, క్రమశిక్షణ, నిలబడ్డ విధానం లక్షలమందిలో స్ఫూర్తి నింపింది. ఇప్పుడు ఆయన్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇక జగన్ కూడా బాధపడ్డారు కావచ్చు. ఇన్ని పతాకాలు ఫ్రీగా ఇచ్చినా ఓడిపోయాను అని.. అంటూ చెప్పుకొచ్చారు మంచు లక్ష్మీ. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.