విన్నాను..చూశాను..మౌనంగా భరించాను..ఇగ ఆగను.. మంచు మనోజ్ ఇంట్రస్టింగ్ వీడియో

విన్నాను..చూశాను..మౌనంగా భరించాను..ఇగ ఆగను.. మంచు మనోజ్  ఇంట్రస్టింగ్ వీడియో

మంచు మనోజ్..టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయనక్కరలేని పేరు. దొంగ, దొంగది మూవీతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన మంచు మనోజ్..తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత శ్రీ, రాజుభాయ్, బిందాస్, వేదం, పాండవులు పాండవులు తుమ్మెద, కరెంట్ తీగ వంటి సినిమాలతో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి కూడా. అయినా సినిమాల మీద ఉన్న ఇష్టం, గౌరవంతో..మూవీల్లో నటిస్తూనే ఉన్నారు.  చివరగా 2018లో ఆపరేషన్ 2019తో వచ్చిన మంచు మనోజ్..ఆ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. దీంతో సినిమాలకు దూరమయ్యాడు. 
.
2022లో  భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్న మంచు మనోజ్  వ్యక్తిగత జీవితం ప్రస్తుతం సంతోషంగా సాగుతుంది. ఈ క్రమంలోనే తన సినిమా కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టే పని ప్రారంభించాడు. ఇటీవలే  సొంతంగా ప్రొడక్షన్‌ సంస్థను ఏర్పాటు చేసి.. అహం బ్రహ్మస్మి చిత్రాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత మళ్లీ మంచు మనోజ్‌ తన సినిమాలపై ఎలాంటి అప్ డేట్ ప్రకటించలేదు. బహిరంగంగానూ.. అటు సోషల​ మీడియాలోనూ సైలెంట్‌ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా మంచు మనోజ్‌  ఇంట్రస్టింగ్ వీడియోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం మంచు మనోజ్ మాటలు  వైరల్‌ అయ్యాయి. 

Also Read :- నాగార్జున వేసుకున్న షర్ట్పై చర్చ.. ప్రత్యేకత ఏంటంటే!

వీడియోలో ఏమన్నాడు..

“నా ప్రపంచం సినిమా. నేను చిన్నప్పటి నుంచి మూవీస్‌ మీద  పెంచుకున్న ప్రేమ నా  వృత్తిగా మారింది.  నన్ను ఒక హీరోని.. నటుడిని చేసింది.  రాకింగ్ స్టార్ అనే పేరు కూడా ఇచ్చింది. అభిమానులు, వారి ఈలలు, అరుపులు, కేకలతో పండగల సాగే నా జీవితంలో సడెన్ గా ఒక సైలెన్స్ వచ్చింది. మనోజ్ అయిపోయాడు అన్నారు.  కెరీర్ కథం అన్నారు.  యాక్టింగ్ ఆపేశాడు. ఇంక తిరిగి రాడు అన్నాడు. ఎనర్జీ స్టార్ లో ఎనర్జీ తగ్గిందన్నారు. అన్నీ విన్నాను..చూశాను.... అన్నింటిని మౌనంగా భరించాను. తిరిగొస్తున్నాను..అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. 

ఎందుకు వీడియో చేశాడంటే...

మంచు మనోజ్ ఈ వీడియో చేయడానికి కారణం అతను రీ ఎంట్రీ ఇస్తున్నాడు. వెండితెరపై కాదు..బుల్లితెరపై.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఈటీవీ కలిసి  మనోజ్ హోస్ట్‌గా ఓ షోను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజాగా ఈ ప్రోమో విడుదల అయింది.  అందులో మంచు మనోజ్ తన వాయిస్‌తో ఈ  విషయం చెప్పేశాడు.