జిన్నా టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్

జిన్నా టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్

డైనమిక్ స్టార్ మంచు విష్ణు తాజా చిత్రం 'జిన్నా' టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమౌతోంది. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో రూపొందుతోంది. హీరో మంచు విష్ణు స‌ర‌స‌న‌ సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్ గా నటించారు. ఇటీవలే సన్నీ లియోన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దీనికి ఫుల్ రెస్పాండ్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ మూవీలో సన్నీ లియోన్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోంది. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న'జిన్నా' పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక జిన్నా టీజర్ ను ఆగస్ట్ 25న  విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ టీజర్ విడుదలకానుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో విష్ణుతో సన్నీ ఓ చమత్కారమైన రీల్స్ విడుద‌ల చేసి ప్రేక్షకులను ఆక‌ర్షించారు. 'నాటు నాటు' ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. త‌న సంగీతంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రుత‌లూగించే అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.