SC విద్యార్థిని మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: మందకృష్ణ మాదిగ

SC విద్యార్థిని మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: మందకృష్ణ మాదిగ

ఖమ్మం SC హాస్టల్లో విద్యార్థిని మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు MRPS చీఫ్ మందకృష్ణ మాదిగ. వెంటనే స్పందన కుటుంబ సభ్యులను ఆదుకోవాలన్నారు. దీనిపై ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు మందకృష్ణ. జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లల్లో మౌలిక సదుపాయాలు కల్పించటంతో పాటు ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలో రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లల్లో సమస్యలు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు మందకృష్ణ.