
ఇవాళ (జులై 31న) ప్రేక్షకుల ముందుకొచ్చిన కింగ్‌డమ్కు పాజిటివ్ టాక్ వస్తోంది. మళ్లీ రావా, జెర్సీ సినిమాల కంటెంట్‌తో శభాష్ అనిపించుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి.. ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ క్రమంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ కథతో (కింగ్‌డమ్) మరోసారి మెప్పించాడని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో వరుస ఫెయిల్యూర్స్లో ఉన్న విజయ్ దేవరకొండకు మంచి హిట్ ఇచ్చాడని క్రిటిక్స్ సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో కింగ్‌డమ్ బడ్జెట్.. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎలా ఉందనే దానిపై నెటిజన్లలో చర్చ మొదలైంది. అంతేకాకుండా, కింగ్‌డమ్కు పాజిటివ్ టాక్ రావడంతో.. క్రియేట్ చేసే వసూళ్ల ప్రభంజనంపై అంచనా వేస్తున్నారు నిపుణులు. మరి కింగ్‌డమ్ టార్గెట్ ఎంతనే వివరాలు తెలుసుకుందాం.
కింగ్‌డమ్ బడ్జెట్ & ప్రీ రిలీజ్ బిజినెస్:
ఈ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా కోసం సుమారు రూ.130 కోట్లు ఖర్చు చేశారు మేకర్స్. నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించారు. ఇంత భారీ బడ్జెట్తో సినిమా చేయడం విజయ్కి ఇదే మొదటిసారి. ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందే మంచి రికార్డ్ బిజినెస్ జరుపుకుంది.
ఈ సినిమా తెలంగాణ (నైజాం) హక్కులు రూ.15 కోట్ల రూపాయలకు విక్రయించారు. ఏపీలో అన్ని ఏరియాలను విడివిడిగా అమ్మినప్పటికీ.. రాయలసీమ (సీడెడ్) డిస్ట్రిబ్యూషన్ హక్కులు రూ.6 కోట్లకి జరుపుకుంది. ఇక ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ.15 కోట్ల మేర బిజినెస్ చేసిందని ట్రేడ్ టాక్. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ సుమారుగా రూ.36 కోట్ల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇదేవిధంగా మిగతా రాష్ట్రాల బిజినెస్ చూసుకుంటే.. కర్ణాటక రైట్స్ రూ.3.5 కోట్లు, ఇతర రాష్ట్రాలు కలుపుకుని రూ.4 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.10 కోట్ల మేర బిజినెస్ జరుపుకుంది.
#KINGDOM - Worldwide Pre - Release Business - 56cr (share)🔥🔥🔥💥💥
— Filmy Bowl (@FilmyBowl) July 27, 2025
Break Even - 110cr + Gross🔥🔥pic.twitter.com/MPOvFSFD3Z
ఇలా ఓవరాల్గా కింగ్‌డమ్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ రూ.54.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ క్రమంలో కింగ్‌డమ్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే బాక్సాఫీస్ వద్ద రూ.56 కోట్లు షేర్ (నెట్), రూ.112 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.