
మంత్రి హరీష్ రావు..! మామ పక్షమో..కార్మిక వర్గ పక్షమో తేల్చుకోవాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సూచించారు. సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరసనకు మందకృష్ణ మద్దతు పలికారు. ఈ సందర్భంగా
20 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తుంటే కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. హరీష్ రావుకి పదవి రాలేదని తెలంగాణ అశేష ప్రజల మొత్తం వెన్నంటి ఉండే ప్రయత్నం చేశారు. కానీ పదవి వచ్చిన తర్వాత హరీష్ రావు ప్రజలను కార్మికులను మర్చిపోయారని వ్యాఖ్యానించారు. హరీష్ రావు కార్మికవర్గం పక్ష మా మామ పక్షము తేల్చుకోవాలన్నారు. అన్నీవర్గాల ప్రజలు హరీష్ రావు ప్రజల మనిషి అని నమ్మకం పెట్టుకున్నారు. నమ్మకద్రోహం చేస్తాడో పదవుల వ్యామోహంలో ఉంటాడో ఆయన విధేయతకే వదిలేస్తున్నాని మాట్లాడారు. అన్నింటికీ స్పందించే హరీష్ రావుకు కార్మికవర్గం ఎందుకు కనబడటం లేదని ప్రశ్నించారు. అన్ని నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందిస్తూ సిద్దిపేట నుండి మాత్రం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.